Type Here to Get Search Results !

పరమును వీడి భువికేతెంచిన ( paramunu vidi bhuvikethenchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమును వీడి భువికేతెంచిన 

దైవ సుతుని విందు 

కలువరిగిరిపై సిలువ పీఠమున 

సిద్ధమైన విందు 

ఇదే ఇదే క్రీస్తు శరీరము - 

ఇదే ఇదే క్రీస్తుని రక్తము

దివ్య సత్ప్రసాదం 

మనకు పరమ ప్రసాదము

పరుగున రండి పాల్గొన రారండి - 

దైవ సుతుని జనమా

భయభక్తులతో లోకానరండి - 

ప్రభు ప్రియ సంఘమా 


1. మన్నా కన్నా మిన్నయైనది - 

తేనెకన్నా తియ్యనైనది 

విందులలో శ్రేష్టమైనది - 

ఈ పరమ విందు 

దివ్య సత్పసాదం మనకు

పరమ ప్రసాదము 

పరుగున రండి పాల్గొన రారండి - 

దైవ సుతుని జనమా

భయభక్తులతో లోకానరండి - 

ప్రభు ప్రియ సంఘమా 


2. శాంతి సమతను ఒసగే విందు - 

క్షమా భావము పెంచే విందు

సోదర ప్రేమను చాటే విందు - 

ఈ దివ్య విందు 

దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము 

పరుగున రండి పాల్గొన రారండి - 

దైవ సుతుని జనమా 

భయభక్తులతో లోకానరండి - 

ప్రభు ప్రియ సంఘమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section