Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మ స్వరం
ప. పరలోక మాధుర్య - విందు
పరమేశ్వరుని - పరమవిందు ||2||
అభిషిక్తుని - ఆత్మవిందు
అమరేశ్వరుని - అమరవిందు ||2||
అ.ప.అందమైన-మందసంలో
కొలువైనా దేవుని
ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం ||ప||
1. సోదర ప్రేమ - నూతన ఆజ్ఞ ఇచ్చి
హితులన్నా - స్నేహవిందు ||2||
మార్గము సత్యము - జీవమై నిలచి
శ్రేష్టమైన ఆత్మీయ - ఆత్మవిందు ||2|| ||అ||
2. వ్యాధి బాధలలో - చిక్కుకున్న వారికి
స్వస్థత నిచ్చెడి - ప్రేమ విందు ||2||
నలిగిన హృదయాలు-కృంగిన దేహాలకు
ఊరట గూర్చెడి-శాంతి విందు ||2|| ||అ||