Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరలోక మందున్న మా ప్రియ తండ్రి
పొగడగ నిలచితి నీ ఘన నామం
1. పరలోకములో భూలోకములో
నెలకొల్పుమయా నీ దివ్యపాలన
జగతిలో జనులు జీవించుటకు
కురిపించుమయా నీ అనురాగం ||2||
నిత్యానందం నీ నామస్మరణం ||ప||
2. నేటికి వలసిన ఆహారమును
దయచేయుమయ్య దయగల తండ్రీ
కృపచూపుమయా కృపగల దేవా
పరలోకరాజ్యం ఇలలో వెలయా
పరమానందం నీ పాద సేవనం ||ప||
3. శాంతి సమతలు మాలో విరియ
పరుల తప్పులను మన్నించగను
మా పాపములను క్షమియించుమయా
ముక్తికి మార్గము చూపించుమయా
హృదయానందం నీ నామ జపము ||ప||
4. మోహపు వలలో మము పడనీయక
దుష్టుల నుండి రక్షించుమయా
నీ ప్రేమలో మము నిలుపుమయా
స్తుతి స్తోత్రములు నీకే దేవా
ఆత్మానందం నీ ప్రేమ గానం ||ప||