Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరలోక ప్రసాదము - దివ్య సత్ప్రసాదము
పరమ మహా ప్రసాదం పరమానికే సాధనం
1. విశ్వయాగ ఫలము - ఆత్మల ఆహారము
శిలువ యజ్ఞ ఫలము - మానవులకు వరము
కల్వరి గిరి త్యాగము - స్వర్గానికి ధామము
యేసు స్వామి జీవము - ప్రేమకు ప్రతి రూపము
2. సర్వులకు భాగ్యము - సమకూర్చే భోజ్యము
భక్తి స్వీకారము - పాపుల పరిహారము
పరమ మనోహరము - దివ్య సమాహారము
స్వామి స్వీయర్పణం - సంతస సంతర్పణం