Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Manoj Kumar
Album: జీవశృతి - 5
పరలోక ప్రేమ విందు-
అపురూప విందు
మధురాతి మధుర విందు-
నవజీవమిచ్చు విందు
1 వ చరణం..
స్వర్గలోక దూతలవిందు -
ఆదాము అవ్వల విందు
అబ్రహాము మోషే విందు-
ఇజ్రాయేలు మన్నా విందు
సీనాయి పర్వత విందు-
ఒప్పంద ప్రేమ విందు
వాగ్ధాన భూమి విందు -
మరపు రాని రక్షణ విందు
2 వ చరణం..
పరలోక రాజ్యపు విందు-
రాజాధిరాజు విందు
సిమియోను ఇంట విందు -
సుంకరుని ఇంట విందు
మార్త మరియల విందు -
శిష్యులంత కోరిన విందు
అప్ప ద్రాక్షరసముల విందు -
సంపూర్ణ త్యాగపు విందు