Type Here to Get Search Results !

పరలోక రాజ్జీ - ప్రభు జననీ ( paraloka ragni - prabhu janani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక రాజ్జీ - ప్రభు జననీ 

ఓ దేవమాతా - మాతల్లివి ||2|| 

వినుతింతుమమ్మా-ప్రార్ధించుమమ్మా ||2|| 

మాదీన మొరను - ఆలించు తల్లి ||2||

||పరలోక|| 


1. పరిశుద్ధ ఆత్మతో శ్రీయేసుదేవుని 

గర్భాన మోసిన విమలాత్మవు 

నీ దివ్య కొమరుని ఆ సిల్వబాటలో 

అనుదినము సాగిన విశ్వాసివి 

మనుజాళి కోసం-ప్రభువాక్కు పాటించి ||2|| 

కడవరకు బ్రతికితివి-మాతా 

కడవరకు బ్రతికితివి ||పరలోక|| 


2. అనురాగ హృదితో ప్రేమించినావు 

దాయాది గృహమును సంధించినావు 

కానా వివాహాన రసము లేనప్పుడు 

పుత్రుని ప్రార్ధించి తోడ్పడితివమ్మా 

నరజాతి రక్షణకై-ప్రభుసిలువ మోసి 

ప్రభు సాక్షివైతివి-మాతా 

ప్రభు సాక్షివైతివి ||పరలోక|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section