Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి.పరమందున-వెలుగొందుచున్న
పరమజ్యోతియైన-ఆమె ఎవ్వరో! ||2||
పల్ల: పరమందున వెలుగొందుచున్న
పరమజ్యోతియైన ఆమెవ్వరో ||2||
కన్న తల్లి మరియాంబరో ||పర||
1. ఆదిలోన ఎన్నికైన
రెండవ యావమ్మరో ||2||
ఆ ప్రభువుకు రక్తమాంసము
లిచ్చినట్టి మాతరో ||2|| ||పర||
2. ప్రభుదాసురాలిననిన పవిత్రాత్మ పత్నిరో ||2||
ప్రభు మాటకు శిరము వంచిన
పర వరముల రాశిరో ||2|| ||పర||
3. వందింతుము ఆయమ్మను
విడువక ఇలయందురో ||2||
పొందును పరలోకంబున
ఆదుకొనెడి అమ్మరో ||2|| ||పర||