Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా `
పరవశిస్తూ ఉంట నీ సన్నిధిలోనేనయ్య
చాలయ్య నీ ప్రేమ చాలయ్య -
యేసయ్యా నీ సన్నిది చాలయ్య ||2||
1 వ చరణం..
నను ప్రేమించి భువికొచ్చిన నీ ప్రేమను -
శిలువలో మరణించి బలియైన ఆ ప్రేమను ||2||
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు -
నా జీవమర్పింతు నీ సేవకు ||2|| ||చాలయ్య ||
2 వ చరణం..
కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమను -
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమను ||2||
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు -
నా జీవమర్పింతు నీ సేవకు ||2|| ||చాలయ్య||