Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరలోక రారాజు యేసయ్యా
మనసున్న మారాజు మెస్సయ్యా
దివి నుంచి దిగి వచ్చె మనకోసం
మమతానురాగాల సహవాసం
ప్రేమ ప్రేమ ప్రేమ మయం
మనసంతా ప్రేమమయం
శాంతి శాంతి శాంతిమయం -
జగమంతా శాంతిమయం
1. ప్రేమ పాలనం ఆయన తత్వం -
నీతిన్యాయమే అతని మహత్యం
శాంతి స్థాపనం ఆయన లక్ష్యం-
ఐకమత్యమే ఆయన ధ్యేయం
రారాజు జననం ఈ వేళ ||2||
రండి చాటుదాం ఊరువాడలా
Happy Happy Happy Happy
Happy Christmas
Merry Merry Merry Merry
Merry Christmas
2. పాపుల రక్షణ పవిత్రకార్యం -
కారుణ్యదేవుని హృదయాభిలాషం
దైవరాజ్య స్థాపనయే - క్రిస్మస్ పండుగ
నిజమైన భావం
రారాజు జననం ఈ వేళ ||2|| -
రండి చాటుదాం ఊరువాడలా
||Happy Christmas||