Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
పరాత్పర దైవం- ధరకేగి నారు
ఆరాధించ రారే శ్రీ బాలను
వారిన్ జూతము- మోక్ష రాజ దైవం
స్తుతించ వడిన్ రండు (ముమ్మారు) బాలునిన్ llస్తుతింll
2వ చరణం..
శ్రీ బాల మమ్మేలు- శుభమే తలంచి
మా భారమౌ పాప దోషాలను
బారద్రోల బాలుడై యున్నారు llస్తుతింll
3వ చరణం..
దావీదు వంశాన- అవతార మాయే
ఈ వేళ పాపాల భరించును
దేవి మరియ శ్రీ గర్భమునందు llస్తుతింll
4వ చరణం..
మృగాల కొట్టాన- జగదీశ్వరుండు
తగం గ జనించే- నారాధన
వేగం చెల్లించ- రండు భక్తులారా llస్తుతింll
5వ చరణం..
మా పాపములెల్ల కోపముంచ కుండ
ఓ పావనా కార మన్నించుము
శ్రీ పాప మేము- చేరా వేడినాము llస్తుతింll