Type Here to Get Search Results !

పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మ మాపైన దిగిరమ్ము ( parishudhathma parishudhathma ma paina dhigiramu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3 


ప. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మ మాపైన దిగిరమ్ము ||2|| 

పరలోక అగ్నితో నన్ను తాకుము 

నా అంతరాత్మను వెలింగిచుము 

పరలోక శక్తితో నన్ను నింపుము

పరిశుద్ధతను నాలో స్థాపించుము ||ప|| 


1. యెషయా పెదవులను

నీ అగ్నితో తాకితివి 

పాపమును తొలగించి 

పరిశుధుని చేసితివి ||2|| 

మలినమైన నా మనస్సును 

నీ అగ్నితోతాకి 

నాలోని పాపము నీవు శుద్ధిచేసి ||2|| 

విజ్ఞానపు వాక్కుతో అభిషేకించు 

వివేకమగు వాక్కుతో అభిషేకించు 

స్వస్థపరచు శక్తితో అభిషేకించు 

ప్రవచించు వరముతో అభిషేకించు 

నీ సప్తవరములతో అభిషేకించు

నీ దాసునిగా నన్ను వినియోగించు ||ప|| 


2. యిర్మియా నోటిలో

నీమాట ఉంచితివి 

ధైర్యమును నింపి 

అధికారము నిచ్చితిని ||2|| 

అను దినము నా నోటిలో 

నీ మాటను ఉంచి ||2|| 

నిత్యము నీ సన్నిధి

నా ముందు పంపి ||2|| 

ప్రేమానందముతో అభిషేకించు 

శాంతి సహనముతో అభిషేకించు 

మంచితనము దయతో అభిషేకించు 

సాత్వికత నిగ్రహముతో అభిషేకించు 

నీ ఆత్మఫలములతో అభిషేకించు 

నీ సేవలో నన్ను వినియోగించు ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section