Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరలోకము నుండి దిగివచ్చితిని
పరమాహారముగా నుండ వచ్చితిని ||2||
అన్న యేసుని మాటలు విందామా
ఆ ప్రభు విందుని గైకొందామా ||2||
1. పితచిత్తము నెరవేర్చగ వచ్చితిని
పాపుల భోజ్యముగా నేనొచ్చితిని ||అన్న ||
2. నిత్య జీవమివ్వగ నేనొచ్చితిని
సత్యము తెలుపుటకై నేనొచ్చితిని ||అన్న ||
3. అప్ప రూపములో నేనుండగ వచ్చితిని
ఆహారముగా నుండ వచ్చితిని||అన్న ||
4. శాంతి రాజ్యమివ్వగ నేనొచ్చితిని
సమానత్వమివ్వగ నేనొచ్చితిని ||అన్న ||
5. అనాధులకు ఆశ్రయమై నేనొచ్చితిని
అంధులకు వెలుగునై నే వచ్చితిని ||అన్న ||