Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరమ పవిత్రములు పరమ పూజ్యములు
పరమ రహస్యములు ఈ దివ్యపూజ
ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి ||2||
మనసార తండ్రిని పూజింప రారండి ||2||
1 వ చరణం..
(ఆశ్చర్యకరుడు మన ప్రభువు
అద్భుతకారుడు బలవంతుడు) ||2||
ఆరాధ్యనీయము ఆ దైవప్రేమ ||2||
సిలువలో చేసిన రక్షణకార్యం
ఆనంద రూపుని కలువరి యాగం పరమ
2 వ చరణం..
(రసరమ్యమైన ప్రభు నామమును పాడి
రక్షణవస్త్రమును పొందుదము) ||2||
దుంఖదినములు గతియించి పోగా ||2||
కొనియాడి స్తుతియించి భజియింపరారండి ||2|| ||పరమ||
నిసనిస పదపని గమపని సనిపమ
గమపమ గమగసగ