Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరమపవిత్రుడ నీవే
పావన చరితుడ నీవే
ఆదిలో వాక్యం నీవే
మా అందరి దేవుడ నీవే ||2||
యేసయ్యా... యేసయ్యా...
నీకే స్తోత్రము యేసయ్యా.. ||2||
1. ద్రాక్షవల్లివి నీవైతే
తీగను నేను యేసయ్యా ||యే||
2. నీదు వాక్యమును బోధింప
నన్ను ఆత్మతో నింపావు ||యే||
3. మాదు పాపములు తొలగింప
ఈ లోకమునకు వచ్చావు ||యే||
4. నీదు సత్యమును మాకొసగి.
వెలుగు మార్గమును చూపావు ||యే||
5. నీదు ప్రజలకు కాపరిగా
నన్ను నీవు నియమించావు ||యే||