Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరమ ప్రసాదము ఈ విందు
పరమును చేర్చును ఈ విందు
అమరమైన విందు ఆత్మీయ విందు ||2||
అద్వితీయ విందు అద్భుత విందు ||2|| ||పరమ||
1. క్రైస్తవుల ఐక్యతకు ఆధారం ఈ విందు ||2||
శ్రీ సభ మనుగడకు మూలము ఈ విందు
ఆనందముతో ఆరగించి ||2||
జీవము పొందుదాం - నిత్యజీవము
పొందుదాం
||అమరమైన|| ||పరమ||
2. మానవుల రక్షణకు చిహ్నము ఈ విందు ||2||
అలసిన మనసులకు ఆత్మబలము ఈ విందు ||2||
ఆనందముతో ఆరగించి ||2||
జీవము పొందుదాం - నిత్యజీవము
పొందుదాం
||అమరమైన|| ||పరమ||