Type Here to Get Search Results !

పరిమళించు పూలతో ( paramalinchu poolatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: శ్రీకర శుభకర సర్వేశా.... 

కరుణ స్వరూపా సర్వోన్నతా 

విశ్వానందమే నీ ప్రియ భావం 

ప్రణుతింతుమయా ఓ త్రీత్వదేవా 

నీ స్మరణే మా జీవిత ధ్యేయం 

సంకీర్తనయే మానస గీతం

సంకీర్తనయే మానసగీతం 


ప: పరిమళించు పూలతో-నీ పూజలు చేతుము 

పరవశించు మనసుతో 

నీ స్తుతులను పాడెదం ||2|| 

సూర్యచంద్ర తారకలను 

సృజియించిన దైవమా ||2|| 

నీ పాదపూజలే-హృదయాలసంగమం ||2||

స్వాగతం...స్వాగతం... -

ప్రభుని కొలుచుదైవజనమా స్వాగతం ||2|| 


1. కరుణించి తన ప్రజలను సీనాయి దరిచేర్చి

ఆజ్ఞల ఒప్పందమ్ము దీవించెను ||2|| 

ఆత్మీయుడు-ఆరాధ్యుడు 

ఇస్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ||2||

ఆనంద గానముతో ప్రణమిల్లి కొలుతుము ||2||

స్వాగతం...స్వాగతం... -

ప్రభుని కొలుచుదైవజనమా స్వాగతం ||2|| ||పరిమళించు|| 


2. ప్రేమించిన తనసుతుని-ఈ ధరిణికి పంపించి

నూతన ఒప్పందములో పాలించెను ||2|| 

జీవేశుడు - పరమాత్ముడు 

సకల మానవాళిని రక్షించిన దేవుడు ||2|| 

విశ్వాస హృదయముతో 

పరిశుద్ధుని వేడుదాం ||2||

స్వాగతం...స్వాగతం... -

ప్రభుని కొలుచుదైవజనమా స్వాగతం ||2|| ||పరిమళించు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section