Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాధుడా
సా: రండి రండి ప్రభు సన్నిధికి
సంతసముతో దివ్య పెన్నిధికి
ప: పరుగున రండి దైవజనమా ప్రభుని
సన్నిధికి వచ్చిచేరుడి
సంతసముతో దివ్య పెన్నిధికి ||2||
ఆహ్వానింతుము దేవుని కుమారుని ||2|| ||ప|| .
1 ప్రభుని వాక్యం మధురం మధురం
ఆలకించి ధ్యానించుదాం
జీవమిచ్చే పరమ వాక్యం
మారు మనసు ప్రసాదించును
సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్ధనలో ||2|| ||ప|| .
2. ప్రభుని విందుని స్వీకరించి నింపుదాం
మన హృదయాలను ఆత్మను నింపే
అమర విందును ఆరగించి తరియించుదాం
సంతోష హృదయాలతో
వేంచేయుడీ పూజకు ||2|| ||ప|| .