Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి
పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి
నా హృదినే పీఠముగ పదిలపరచితి
స్వీకరించగా ఆశ్రయించితి ||2|| ||ప||
1 నీ స్మృతి నే శ్రుతిచేసి పలుకగా
భావాల రాగాలు ఆలపించ ||2||
నీలోనే ఏకమై అంకితమవ్వగ
నా హృదయ వీణపై మీటితిని
నీ మదిలో పదిలపర్చ ఆశతో ||2||
అర్పించగ తలచాను ఈ గీతిక ||ప||
2 నీ స్తుతి నే కృతి చేసి పాడగా
ప్రేమానురాగాలు పరశింపగా ||2||
నీ దివ్య స్పర్శకై తన్మయమొందగా
నా జిహ్వతో నిన్నే పిలచితిని
నీ మదిలో పదిల పరచ ఆశతో
అర్పించగా వచ్చాను నీ సన్నిధి ||ప||