Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Christopher Babu
Album: పరవశింతు ప్రభువా
నిససస గరిసస నిససస గరిసస నిససస గరిసస మమ గరిస
నిససస గరిసస నిససస గరిసస నిససస గరిససస పప గరిప
ప. పరవశమొంది అర్పణ చేతుము
ఈ శుభవేళ నా ప్రభువా ||2||
శాంతికరా మా కానుక గైకొని ||2||
నీ కృపతోమా హృదయము నింపు ||2|| ||ప||
1. నీ దయవలన పొందినవన్ని
నిర్మల మనస్సుతో తెచ్చితిమి ||2||
అందుకొ అర్పణ ఆత్మ స్వరూపుడ ||2||
అన్నియు నీవై మము కావుమయా ||2|| ||ప||
2. నీ శిష్యులుగా పిలుపును పొంది
చేరితి ప్రభు నీ సన్నిధి ||2||
దీనులము మము కరుణించుమయా ||2||
దీవెన మాపై ప్రసరించుమయా ||2|| ||ప||