Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: అలకించుమోదేవా
సా. హే యాజకాగ్రేశ్వర ..... పాపహరా...
ఇహపరలోక నిత్యాధిపతి
సకల మానవ రక్షణదాత....
యేసుక్రీస్తు ప్రభో....
నమస్తే...నమస్తే...నమస్తే
ప. పరవశ హృదయముతో... దేవా చేరితి
నీ పీఠము (నీ సేవకై) దేవా ||2||
స్వామి పిలుపుల గంటలు మ్రోగ
మాదు హృదయములు పులకించెనుగా ||2||
నీదు బిడ్డలను దీవించగనూ
వేగమే రావయ్యా మమ్మును దీవించవా ||2||
1. మమతలు పండిన పులకిత మనసుల
మధుర సరాగము పలికిన వేళలో
మరియ నందనా...
నీ ప్రియ పిలుపుకు ||2||
బదులుగా నేనే వచ్చితి స్వామి ||ప్ర||
2. నీ సేవలనే నిరతము చేయగా
మలచితివి నను నీ పరికరముగా
జననీ జనకుల దీవెన పొంది ||2||
నీ దరి చేరితి నా ప్రాణ ప్రియుడా ||ప్ర||