Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:- పరిశుద్ద ఆత్మనే దైవమా – పావన
స్నేహ ప్రకాశమా – పావన దాతవు
నీవేగా – మానవ సంఘానికి మార్గమా ||2|| ||పా||
1.పరిశుద్దాత్మా మనలో వేంచేసి
పాపాంధకారము పోగొట్టి
ఏడు జ్ఞాన వరములను||2||
ఇంపుగ మనపై కురిపించును ||2|| ||పా||
2.పరిశుద్ధాత్మ మనపై వేంచేసి
శాంతి సమాధానము చేకూర్చును
పండ్రెండనుగ్రహములను
ఇంపుగ మనపై కురిపించును ||2|| ||పా||