Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్ధ జీవితం జీవింప -
నా శక్తి నాకు సరిపోలేదే
మళ్ళీ మళ్ళీ పడిపోకుండ....
నీ ఆత్మతో ఆదుకో యేసు నాధా
పరిశుద్దుడా - పరిశుద్ధుడా -
పరిశుద్ధ నదిలో నను ముంచుమా
పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా
1. ఈలోక సంపద నిలిచి ఉండునా -
ఈలోక స్నేహం నన్ను రక్షించునా
లోకమంత నే సంపాదించి -
ఆత్మను కోల్పోయిన లాభం ఏమి
2. ఈలోక కీర్తి నిలిచి ఉండునా -
ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా
ఈలోకము దాని వ్యామోహము -
గతియించి పోవును ఒక రోజున