Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-10
ప. పరిశుద్ధ జీవితం జీవింప
నా శక్తి నాకు సరిపోలేదే
మళ్ళీమళ్ళీ పడిపోకుండా
నీ ఆత్మతో ఆదుకో యేసునాధా
పరిశుద్దుడా పరిశుద్దుడా పరిశుద్ద నదిలో
నను ముంచుమా పరిశుద్ద రక్తముతో
నను కడుగుమా ||పరి||
1. ఈ లోక సంపద నిలిచియుండునా
ఈలోక స్నేహం నన్ను రక్షించినా
లోకమంత నే సంపాదించి ఆత్మను
కోల్పోయిన లాభం ఏమి? ||పరి||
2. ఈ లోక కీర్తి నిలిచియుండునా
ఈలోక జ్ఞానం నన్ను బ్రతికించినా
ఈలోకము దాని వ్యామోహము
గతియించిపోవును ఒకరోజున _ ||పరి||