Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం
ప. పరిశుద్దుడైన మహాప్రభూ! ||3||
పరిశుద్దుడైన మహాప్రభూ!
ఈ పాపిని పిలిచితివా
ఎట్టివాడనో ఎరిగియుకూడ
ఈ దీనుని పిలిచితివా
పరిశుద్దుడైన మహాప్రభూ!
శరణం - శరణం - 'శరణం - శరణం
1. నన్ను పిలిచిన ప్రభు నీవు
విశ్వాసనీయుడవు
పిలిచిన వారిని బలపరచి
నీ మహిమతో నింపెదవు ||2||
అర్హుడను కాను - నేనర్హుడను కాను
నీ నామము పలుకుటకు
నేను అర్హుడను కాను
నీ సన్నిధిలో నిలుచుటకు
నేను అర్హుడను కాను.
శరణం - శరణం శరణం – శరణం ||ప||