Type Here to Get Search Results !

పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ( parishudhathma parishu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 
Music: Praveen M 
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3 

ప. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మాపైన దిగిరమ్మ ||2|| 
పరలోక అగ్నితో నన్ను తాకుము 
నా అంతరాత్మను వెలింగిచుము 
పరలోక శక్తితో నన్ను నింపుము
పరిశుద్ధతను నాలో స్థాపించుము ||ప|| 

1. యెషయా పెదవులను
నీ అగ్నితో తాకితివి 
పాపమును తొలగించి 
పరిశుధుని చేసితివి ||2|| 
మలినమైన నా మనస్సును 
నీ అగ్నితోతాకి 
నాలోని పాపము నీవు శుద్ధిచేసి ||2|| 
విజ్ఞానపు వాక్కుతో అభిషేకించు 
వివేకమగు వాక్కుతో అభిషేకించు 
స్వస్థపరచు శక్తితో అభిషేకించు 
ప్రవచించు వరముతో అభిషేకించు 
నీ సప్తవరములతో అభిషేకించు
నీ దాసునిగా నన్ను వినియోగించు ||ప|| 

2. యిర్మియా నోటిలో
నీమాట ఉంచితివి 
ధైర్యమును నింపి 
అధికారము నిచ్చితిని ||2|| 
అను దినము నా నోటిలో 
నీ మాటను ఉంచి ||2|| 
నిత్యము నీ సన్నిధి
నా ముందు పంపి ||2|| 
ప్రేమానందముతో అభిషేకించు 
శాంతి సహనముతో అభిషేకించు 
మంచితనము దయతో అభిషేకించు 
సాత్వికత నిగ్రహముతో అభిషేకించు 
నీ ఆత్మఫలములతో అభిషేకించు 
నీ సేవలో నన్ను వినియోగించు ||ప|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section