Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్ధాత్మ పావనాత్మ వేంచేయవా నీ దాసునిపై
1. యోర్దాను నదిలో యేసయ్యపై-వేంచేసినాత్మ వేంచేయవా
అభిషేకించుము దేవా అభిషేకించు - నీదు సప్తవరములతో అభిషేకించు
అభిషేకించుము ఆత్మ అభిషేకించు - నీదు అనుగ్రహములతో అభిషేకించు
2. పేదలకు సువార్తను బోధించుటకు -వేంచేయవా నీ దాసునిపై ||అభిషేకించుము||
3. చెరనున్నవారికి విడుదల కలిగించుటకు వేంచేయవా నీ దాసునిపై ||అభిషేకించుము||
4. గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు-వేంచేయవా నీ దాసునిపై ||అభిషేకించుము||
5. పీడితులకు విమోచన కలుగజేయుటకు -వేంచేయవా నీ దాసునిపై ||అభిషేకించుము||