Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-19
ప. పరిశుద్ధుడా పరిశుద్దుడా నీలాగే నన్ను
మార్చు పరిశుద్ధుడా ||2||
ఇది పరిశుద్ద కాలమయ్యా ||2||
ఇది పరిశుద్ద ప్రజల
యొక్క ప్రార్థనయ్యా ||2|| ||ప||
1. అన్ని రకమైన తలపులకు
లొంగిన రోజులు చాలు
అన్నిరకమైన అలవాటులతో
ఆడిన రోజులు చాలూ
అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాను
దుష్టుని వలలో చిక్కుకుని ఏడుస్తున్నాను ||2||
నీ పరిశుద్ద రక్తముతో నను కడుగుమా ||2||
నీ పరలోక ఆత్మతో ననునింపుమా ||2||
యేసయ్యా నా యేసయ్యా ||4|| ||ప||
2. నన్ను నీవు తరిమేసినా
ఎక్కడికి నే వెళ్ళేదను
నీదు ఆత్మను తీసివేసినా
ఎట్లు నేను జీవింతును
అబ్బా నీలో ఉన్నంత వరకే నాకు సంరక్షణ
నీదు కృపయే
బలహీనతలో నన్ను కాచును ||2||
నీ పరిశుద్ధ వచనమును నాకివ్వుమా
నీ కల్వరి భారము నా కివ్వుమా ||ప||