Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నిన్నే ప్రేమింతును యేసయ్య
ప. పరిశుద్ద, పరిశుద్ద, పరిశుద్ద ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
1, పరిశుద్ధ జనకుఁడ పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతిప్రభావ ||పరి||
2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణా సముద్రా ||పరి||
3. పరిశుద్ద మగునాత్మ వరములిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా ||పరి||
4. జనక కుమారాత్మలను నేక దేవా
ఘనమహిమ చెల్లును ధరన నిత్యముగా ||పరి||