Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరుగిడి రండి మీరంతా
ప్రభుని ప్రేమలో పయనింప
దైవరాజ్యము పొందుట కొరకు
అంతోని వారిని ప్రార్థించు
ఆ అంతోని వారిని అనుసరించు పునీత అంతోని వారా
మా కొరకు ప్రార్థించండి ||2||
1. భారత ప్రజలు నిన్ను
భక్తితోడ పొగడెదరు
పిత సన్నిధిలో వేడగ మమ్ము
వేడుచుంటిమి మిమ్ము
పునీత అంతోని వారా
మా కొరకు ప్రార్ధించండి ||2||
2. కనిపించని వస్తువులను
కనిపించెడి వానిగ చేసి అడిగిన తోడనే
వరముల నొసగే అమరుడవైన తండ్రి
పునీత అంతోనివారా
మా కొరకు ప్రార్థించండి ||2||
3. పవిత్రాత్మ మహిమతో
ప్రభుని పోలి ఇలనడచి
వేద సాక్షిగా మరణము పొంది
ధన్యజీవివైనావు ||2||
పునీత అంతోని వారా
మా కొరకు ప్రార్థించండి ||2||