Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-13
ప. పరులకు వెలుగును ప్రసాదించు
క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామీ
1, కోపము ఉన్న చోటెల్లా
నీదు శాంతిని స్థాపింప నేర్పించు ||2||
ద్వేషము ఉన్న చోటెల్లా
నీదు ప్రేమను స్థాపింప నేర్పించు
శరణము, శరణము శరణము, యేసా
శరణము శరణము శరణము క్రీస్తా
2. భూమికి ఉప్పుగ రుచినిచ్చు వానిగ
తననే కోల్పోవు త్యాగిగా మార్చు
నాదని నాలో దాచుకున్నది
నా నుండి మాయమై పోతుంది
పరులకు ఘనంగా ఇచ్చినదంతా
నాలోనే నిలచి నను దీవిస్తుంది
శరణము, శరణము శరణము యేసా
శరణము శరణము శరణము క్రీస్తా