Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జో...లాలి... జో... లాలి
పశుల పాకలో పసిపాపవై
పవళించిన ఓ బాలయేసా ఈ పూజలోన పావనమైన ||2||
మా హృదయాలలో వసియింపరావా ||2||
1. దివమున ప్రభునకు మహిమయును - ధరలోన నరులకు శాంతియనుచు
పాడిరి దూతలు జోలపాట - శాంతిని మాలో నింపుమయా
2. నిను చూడ వచ్చిన జ్ఞానులకు-దారిచూపెను ఒక తారక ||2||
నిను గన ఆశించెడు మాకు-కాంతిని ఇలదయచేయమయా ||2||
3. అట కాపరులకు నీ జననం-తెలుపగ దూతను పంపితివి ||2||
నీ జ్ఞానము మాకొసగుటకై నీ ప్రవక్తల భువికంపుమయా ||2||
జో..లాలి...జో...లాలి ||2||