Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పావనాత్మా వేగమేరావా ||2||
నీ శక్తితో మము ఆవరించవా
నీ మహిమను ఘనపరచవా ||2||
అల్లెలూయా.. ||4||
ఆ...ఆ...ఆ...
1. ఆదిలో జలములపై కదలాడిన దేవ
భువిలోని జనములను కరుణించరావా ||2||
మాడెందముల కరిగించుమా ||2||
పరివర్తనము కలిగించుమా ||2|| ||అ||
2. పావుర రూపములో యేసుపైకి వచ్చితివి
అగ్నిజ్వాలలవోలె శిష్యులపై కొచ్చితివి ||2||
నీ సప్త వరములను మాపై కురిపించుమా
నీ సప్త ఫలములతో మమ్ము బలపరచుమా
అల్లెలూయా...... ||పా||