Type Here to Get Search Results !

పవిత్ర ఆత్మమా మాపైకి ( Pavithra athmama mapaiki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: లోక రక్షకుడు 


ప. పవిత్ర ఆత్మమా మా పైకి దిగిరావా 

పావన తేజమా వేగమే విచ్చేయవా ||2|| 

వేచియున్నాను చేతులు చాచి ఉన్నాను ||2|| 

ఆత్మీయ వరముతో నన్నునింపుము ||ప|| 


1. నీత్యాగ ధనమివ్వు నీజ్ఞాన బలమివ్వు

నీ వాక్య ధ్వనినివ్వు నాకు క్షమాగుణమివ్వు ||2|| 

అభిషేకవరము నాకివ్వు 

అనంత ప్రేమ నాకివ్వు ||2|| ||ప|| 


2. పరోపకార బుద్దివ్వు 

మేలుచేయు మనసివ్వు 

నీ శక్తి నాకివ్వు 

నీ సేవచేయు బలమివ్వు ||2|| 

నిండైన దీవెన కురిపించు 

ప్రేమతో మమ్ము పాలించు ||2|| ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section