Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: పావురమా సంఘముపై
వ్రాలు నిదే జ్వాలలుగా
హల్లెలూయా-హల్లెలూయ ||పా||
1. తొలకరి వానలు కురిసే
ఫలభరితంబై వెలసే
కలవరి చినుకులు-పడగ పొలములో ||2||
ఫలియించెను దీవెనలే
2. అభిషేకాలాం కృతమై
అపవాదిని కూల్చేదవే ||2||
సభకే జయమా-ఉబికే జీవమా ||2||
ప్రబలెను ప్రతి హృదయములో ||2|| ||పా||
3. కనుతెరచెను నీకనులే
వినజేసెను నీ చెవులే ||2||
నను తాకేను నాతనువే వశమై ||2||
నిను చూపును లోకములో ||2||
4. బలహీనతలో బలమా
బహుమానములో మహిమా
వెలిగే వరమా ఓ పావురమా
దిగిరా త్వరగా ||2|| ||పా||