Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్లోకం: పిత సర్వేశ్వరా... స్వాగతం... సుస్వాగతం
పుత్ర సర్వేశ్వరా... స్వాగతం... సుస్వాగతం
పవిత్రాత్మ సర్వేశ్వరా.. స్వాగతం... సుస్వాగతం
ఓ... త్రీత్వైక సర్వేశ్వరా... నమస్తే.. నమస్తే.. నమోనమః
పల్లవి:
పెండ్లీ కుమారునిగా... వచ్చుచున్న దేవుని ||2||
హృదయం దీపం వెలిగించి...
కొనియాడ పరుగిడి రారే...
స్వాగాతింప రారే... పరవశ మొందరారేll పెండ్లి ll
కోరస్:we welcome Our Lord, We Welcome Our Jesus
1 వ చరణం..
మానవునిగా జన్మింప వచ్చిన మన తండ్రి దేవుని
మనుజాళి మనుగడ చూపిన – మన క్రీస్తు నాధుని
ఉన్నవాడు, నిత్యుడు – ఆద్యంత మగు దేవుని ||2||
ఆరాధింప త్వరపడిరారే – ప్రార్ధింప పరుగిడి రారే ||2||
కోరస్:we welcome Our Lord, We Welcome Our Jesus
2వ చరణం..
మార్గము, సత్యము, జీవమైన మన యేసు దేవుని
నిత్య రక్షణా ద్వారమైన మన క్రీస్తు నాధుని ||2||
ఉన్నవాడు, నిత్యుడు – ఆద్యంత మగు దేవుని ||2||
ఆరాధింప త్వరపడిరారే – ప్రార్ధింప పరుగిడి రారే ||2|| ll పెండ్లి ll
కోరస్:we welcome Our Lord, We Welcome Our Jesus
3వ చరణం..
మరణమును జయించిన దేవుడు ఉత్థాన క్రీస్తుని
రక్షణ దేవుని గొర్రెపిల్ల మన జీవన దాతను ||2||
ఉన్నవాడు, నిత్యుడు – ఆద్యంత మగు దేవుని ||2||
ఆరాధింప త్వరపడిరారే – ప్రార్ధింప పరుగిడి రారే ||2|| ll పెండ్లి ll