Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పితకు ప్రియకుమారివి
సుతునకు ప్రియజననివి
ఆత్మకు సంభూతివి
మాకు ప్రియమాతవు
1 వ చరణం..
నుసికాని కాలుతున్నపొదయే
నీ నిష్కళంక హృదయ చిహ్నము
మసికాని అగ్నిలోని బాలురే
నీ వాడిపోని కన్య చిహ్నము
నిర్మల హృదయం
నీ అపురూప సౌందర్యం
మలచుమా మార్చుమా
మాదు హృదయ నీ పోలికగా
వందనమమ్మా మా మోక్షరాజ్ఞి
జేజేలు పాడెదం
దివినేలు రాణి దీవించుమమ్మా
ఈ దీనబిడ్డలను
2 వ చరణం..
సమస్త ప్రాణికోటి పోషకుని
నీ చనుబాలుతో పోషించినావు
దివి భువియు పట్టని పుత్రుని
నీ చలువ హృదిలో పదిలపరచినావు
వర్ణింప సాధ్యమా నీ మాతృప్రేమను2
మలుచుమా మార్చుమా
మాదు హృదయము నీ పోలికగా
(వందనమమ్మా)