Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 2
ప: పూజాబలి నిత్యపూజాబలి
క్రీస్తుని రుధిర కలువరిబలి ఇది ||2||
తండ్రిని స్తుతించుదాం
మన తండ్రిని స్తుతించుదాం
తండ్రిని స్తుతించుదాం
పరమ తండ్రిని స్తుతించుదాం ||2|| ||పూ||
1. పాపపు ముళ్లును విరిచిన ప్రభుని బలి
జీవపు ద్వారమును తెరచిన విభుని బలి||2||
సంతోష ఆనంద హృదయబలి
సజీవ దేవుని సత్యబలి
రండి రారండి...
ముదమారపూజింతము ||2|| ||పూ||
2. సమతమమతలను ఒసగిన క్రీస్తుబలి
కరుణ ప్రేమలను పెంచిన దివ్యబలి ||2||
శ్రీసభ హృదిలో కృపాబలి
తండ్రిని ఘనపరచే మహిమబలి ||2||
రండి రారండి
ప్రణమిల్లి కొనియాడుదాం ||2|| ||పూ||