Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : సర్వోన్నత దేవా - మా సర్వేశ్వరా
ప్రేమ.. దయా... కరుణ తేజోమయా మీకే అంజలి... ప్రణయాంజలి
సాసని సాసని సాసని సరిగమ పాపప సనిమపా
మామమ నీప గగగ పామ రిగమ సరిగ రినిసా
ప : పూజలో పాల్గొనగా వేగమే రారండి -
బలిపూజలు సేయగా పరుగిడి రారండి - ||2||
ఆ ప్రభు యేసు నీ రక్షణ యాగ బలిలో-||2||
స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా - ||2||
1. సమతా మమతల ఆలంబనలో-సతతము కూడి కొనియాడాలిని ||2||
సంతసముతోనే సన్నిధి చేరి -
దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి
తన రూపముగా మలచిన దేవుని
స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగాll పూజ ll
2. యాజక గురువుతో ఈ యాగ బలిలో -
కడరా స్మరణం మాకిల శరనం
సత్యము మార్గము జీవము తానై -
తన ప్రేమ సంరక్షణలో నిరతము మము కాచి
నిత్యము మాకు తోడైన ప్రభువును
స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగాll పూజ ll