Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పూజవేళలో - స్వాగతగీతం
ఆలపించెదం - ఆనందముతో
సఖ్యతతో - మరి సంతోషముతో
కీర్తించెదం - ప్రభు నామమును ||2||
స్వాగతం స్వాగతం - ఘనస్వాగతం ||2||
1 వ చరణం..
ప్రభువే సత్యం - ప్రభువే నిత్యం
ఆయన మహిమను - స్తుతియించుటకు ||2||
దేవాలయమే - దేవుని ప్రజలని ||2||
మనమందరము - ప్రకటించుటకు ||2|| llస్వాగతంll
2 వ చరణం..
సమాధానమున - మన మందరము
సోదర ప్రేమను - చాటుటకోసం ||2||
క్రీస్తు ప్రేమలో - జీవనయానం ||2||
నిరతము మనము - సాగించుటకై ||2|| llస్వాగతంll