Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: వాక్యప్రకాశిని
సా. సర్వలోకాల అధిపతి పరలోక తండ్రీ నమస్తే
సర్వలోక జనుల రక్షణ కర్త
కన్యమరియ సుతుడా నమస్తే
పరిశుద్ధాత్మ ఆదరణకర్త త్రియేక దేవా
నమస్తే...నమస్తే...నమస్తే...నమో నమ:
ప. పూజలు సేయ దేవుని జనమా
పూమాలలతో పరుగున రండి ||2||
పావన యేసుని వాగ్దానముల ||2||
ఫలమును పొంద వేగమేరండి ||2||
1. ఆది దేవుని అభిషిక్తుడు
మానవాళికి రక్షణ మూర్తి
సిలువ బలియను యాగమున ||2||
పండించును నవజీవం ||పూ||
2. జీవమొసగు పరమాత్మునుకి
హృదయ దీపిక వెలుగించుదమా ||2||
కరుణతోడా జీవము నీయగా ||2||
వేడుదమా పరిశుద్దుని ||2|| ||పూ||