Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పూజార్పణం-హృదయార్పణం
ప్రేమార్పణం-సేవార్పణం ||2||
స్తుతి పాత్రుడా-సృజనాత్ముడా
నా పేదహృదిని-అర్పింతును ||2|| ||పూజా||
1. ఈ భూమి ఫలములు-నీ ప్రేమ సిరులు
ఈ అప్పరసములు-నీ త్యాగ సిరులు ||2||
నా గుండె గుడిలో-నివసింపరావా
ఆనంద హృదితో-సమర్పింతును ||2||
ఆనంద హృదితో సమర్పింతును ||పూజా||
2. ఈ ఫలపుష్పములు-నీ దివ్య సిరులు
ఈ ధన ధాన్యములు-నీ నవ్యసిరులు ||2||
అనురాగ నిలయా-ఆరాధ్య దేవా
ఉప్పొంగే హృదితో-అర్పింతును ||2||
ఉప్పొంగే హృదితో అర్పింతును ||పూజా||