Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: ప్రభాత మంగళ పూజావేళ -
పరమోన్నతుని పద సన్నిధికి
స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో -
పరుగున రండి ప్రభు జనమా
త్వరపడి రండి ప్రియ జనమా -
రారండి వేడండి ప్రభు దీవెన పొందండి
ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి
1. రాచరికపు గురుకులమని యనుచు -
శుభ దేవునికి ప్రియ జనమనుచు
ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి
స్తుతులర్పించగ రారండి ||రారండి||
2. మొరవిని కరుణగ కాంచే రాజని -
అందరిని దరిచేర్చే ప్రభువని
కృతజ్ఞతా భావము కలిగి -
పీఠము చెంతకు చేరండి! ||రారండి||