Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభాత సమయములో గుడిగంటల నాదస్వరం
గగన తరoగమై ప్రభుపూజకు పిలిచెనుగా ||2||
పరులతో సక్యమై ప్రణతులు చేయగా
వేగమే చేరుము ఈ దివ్య పూజకు ||2||
చరణం:-
కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం
పాపక్షమాపణ వాక్యబోధన ఆత్మకు ప్రక్షాళనం ||2||
పరమప్రసాదము గైకొనరారండి
హృదయపు వాంఛలు తీర్చును రారండీ ll2ll llపరులతోll
చరణం:-
జీవముపొంద జీవితేశుని జీవము గోనరండి
గోచరమైన దేహమువిడి పరమును చేరండి ||2||
దివ్య సంస్కారము ఈ బలియాగము
శాశ్వత జీవము పొందగ రారండీ ll2ll llపరులతోll