Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ప్రభు జనులారా, యాజకులారా దేవుని
కీర్తించుడి సంతోషముతో సంకీర్తనతో
స్తుతులను చెల్లించుడి ||ప్రభు||
1. నవ్య సాంబ్రాణి పరిమళము •
దివ్య పీఠాన వెదజల్లి లిల్లీపువ్వుల
సౌరభము ఈ మందిరమున వర్థిల్లి
హృదయాన ప్రభుయేసు
అరుదెంచు వేళ ||2||
అధరాన శుభవార్త రవళించు వేళ ||2||
సన్నిధిలో-సఖ్యతతో స్తోత్రము చేయుట ధన్యతగా
ప్రార్థనతో ప్రమోదముతో పూజలు చేయుదము ||ప్ర||
2. మానస వీణ స్వరఝరులు
స్తోత్రగీతాలు వినిపించ
పొంగిపొరలు ఈ నా హృదయం
రమ్యభావమున పులకించ ప్రభు
ప్రేమవాహినులు ప్రవహించు వేళ ||2||
కరుణా కటాక్షాలు కురిపించు వేళ ||2||
వినయముతో, విధేయతతో
వందన గీతం పాడుదము
స్నేహముతో సఖ్యతతో
శుభములు పలుకుదము ||ప్ర||