Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. ప్రభు పూజా సమయం
ఇది అర్చన సమయం
అనురాగ హృదయంతో
ప్రియ యేసుని కొలిచెదము
1. వికసించెను తూర్పున ఉదయం
కనిపించెను దేవుని సదనం
ఆరాధనతో ఆనందముతో
జీవన జ్యోతిని కీర్తింతుము
2. ప్రభవించెను పావన కిరణం
అరుదెంచెను దేవుని జీవం
నజరేయుడగు ప్రేమస్వరూపిని
సుమమాలలతో పూజింతుము
3. గుడిగంటల జీవనరాగం
మీతించెను సుమధుర గానం
ఆత్మీయతతో హృదయేశ్వరుని
ఆశీస్సులకై ప్రార్థింతుము