Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నిన్నే ప్రేమింతును యేసు
ప: ప్రభు మందిర ఆవరణంలో
పరిపూర్ణ సంతోషం కలదు
ప్రతి భారం మోసెడి ప్రభుని చేరి
ప్రార్థించుట మంచిది ||ప్ర||
ప్రభు పిలచుచు ఉన్నాడు .
నిన్నే తలచుచు ఉన్నాడు ||2||
1. హల్లేలూయ హోసాన్న ||2||
హోసాన్న హల్లేలూయ హల్లేలూయ ||2||
ఒక దినమే ప్రభుతో ఉంటే
వేయి దినముల సంతోషం
నీ హృదయమే మందిరమైతే
ప్రభు నీతో ఉండుట తథ్యం ||2||
ఆ ఆత్మయే తోడై ఉంటే
ప్రభు విచ్చును నిత్య జీవం
ప్రభు పిలుపును వినరండి
ప్రభుని సన్నిధి చేరండి
ప్రభు పిలచుచు ఉన్నాడు
నిన్నే తలచుచు ఉన్నాడు
2. హల్లేలూయ హోసాన్న
హోసాన్న హల్లేలూయ హల్లేలూయ ||2||
ఘనత ప్రభావమును
ప్రభు సన్నిధిలోనే కలవు
నీ బలము సంతోషమును
ఆ ప్రభువునందే కలవు ||2||
పరిశుద్ధుడా శుద్ధుడనీ
ప్రభూ నారాధించుట ధన్యం
ప్రభు అనంత ప్రేమలోనే
పరవశమూ పొందెదము ||ప్ర||