Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభూ నా పడవను నడుపు నీ మహిమగల నామమున
అంతిమ కామయ్యా నీ సత్యములో నడుపు ||2||
ఈ లోకమనే సముద్రము ఎంత పెద్దగ ఉండిన నాకేమి
నా జీవితమనే పడవ ఎంత చిన్నగ ఉండిన నాకేమి
ఎత్తుగ వచ్చే భయపరచె అలలు వచ్చిన నాకేమి
ఈ సముద్రమును నా పడవయు నీవేనయ్యా
దాన్ని నడిపే వాడవు నీవేనయ్యా llప్రభూll
1 వ చరణం..
అలలు నిండిన సముద్రములో
అల్లాడి పోతుంది నా జీవితం ||2||
ఈ లోకములో కష్టాలు మీరు
అనుభవించెదరు కాని ధైర్యము వహింపుడు
ఆ...........ఆ...........
నే లోకాన్ని జయించితిని అని చెప్పిన దేవా
ఉన్నావే నాలో చాలు ।ప్రభూll
2 వ చరణం..
పాపము ఎక్కడ పెరుగుతుందోనా
కృప అక్కడ అధికమౌను ||2||
నీకు కలగపోవు శ్రమలను గూర్చి
భయపడకుడు అది పది దినములు మాత్రమే
ఆ.........ఆ..........
మీరు స్థిరముగా నిలబడుడని అని పలికిన దేవా
ఉన్నావే నాతో స్తోత్రం llప్రభూll