Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రార్ధన ప్రార్ధన ప్రభు ఏసుని ప్రార్ధన ||2||
మహిమ గలదీ ప్రార్ధన
శక్తి గలదీ ప్రార్థన
మోక్షమొసగే ఈ ప్రార్థన
పరమాత్మను చేర్చే ప్రార్థన ||2||
1. దినదిన ప్రార్థన - దివ్యమైన ప్రార్ధన
విశ్వాస ప్రార్థన ఆత్మీయ ప్రార్థన
ఉపవాస ప్రార్థన-బలమైన ప్రార్థన
కన్నీటి ప్రార్థన-కరుణించే ప్రార్థన ||ప్రా||
2. పసివారి ప్రార్థన - ప్రేమగల ప్రార్థన
యౌవ్వనుల ప్రార్థన - అర్ధించే ప్రార్థన
వృద్దుల ప్రార్థన - శరణుకోరే ప్రార్థన
పదిమంది ప్రార్థన-ఘనమైన ప్రార్థన ||ప్రా||