Lyrics/Tune: Fr. Kristhuraj
Music: M Linus
Album: ప్రార్థనా శక్తి
ప. ప్రార్థనా శక్తి మాకు కావాలయా ||2||
నీ పరలోక అభిషేకం కావాలయా ||2||
యేసయ్యా కావాలయా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ||2|| ||ప్రా||
1. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి
నేనూ ప్రార్థింపగ దయ చేయుమా ||2||
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా||2||
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా ||ప్రా||
2. సింహాలగుహలోని దానియేలుశక్తి
ఈ లోకంలో నాకు కావాలయా ||2||
నీతో నడిచే వరమీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా||ప్రా||