Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రార్ధన వినెడి పావనుడా
ప్రార్ధన మాకు నేర్పుమయా
1, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య
బృందముకు నేర్పితివి
పరముడ నిను ప్రణుతించెద
ప్రియముగ ప్రభుయేసు
ప్రార్ధన నేర్పుమయా . ||2|| ||ప్రా||
2. పరమ దేవుడవని తెలిసి
కరములెత్తి జంటగా మోడ్చి
శిరమును వంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్ధన నేర్పుమయా ||2|| ||ప్రా||
3. దినములోన చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడనయ్య ఒంటిగ
కొండపై చేసిన ప్రార్ధన నేర్పుమయా ||2|| ||ప్రా||
4. శ్రమలు యేసువా చుట్టుకొని
శత్రు మూక నిను బట్టగను శాంతముతో
శరణని వేడిన గెత్సెమనే ప్రార్ధన నేర్పుమయా||2|| ||ప్రా||